101
అక్షరటుడే, బోధన్: Bodhan MLA | బోధన్ మున్సిపల్ పరిధిలో (Bodhan municipal area) పలు వార్డులలో ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) గురువారం పర్యటించారు. ఆయా కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.
పట్టణంలోని పలు కాలనీవాసులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కాలనీలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం కూడా తక్షణమే చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.