ePaper
More
    HomeతెలంగాణMLA Arikepudi Gandhi | హైడ్రాపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. కూల్చివేతల అడ్డగింత

    MLA Arikepudi Gandhi | హైడ్రాపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. కూల్చివేతల అడ్డగింత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLA Arikepudi Gandhi | హైదరాబాద్​ నగరంలోని మాదాపూర్​(Madhapur)లో గల సున్నం చెరువును అభివృద్ధి చేయాలని హైడ్రా సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ చెరువులో కలుషిత జలలాతో ప్రజారోగ్యానికి ముంపు పొంచి ఉందని ఇటీవల హైడ్రా(Hydraa) పేర్కొంది. చెరువులో ఆక్రమణలు తొలగించి.. మంచినీటితో నింపుతామని అధికారులు అన్నారు. ఈ క్రమంలో సోమవారం హైడ్రా సిబ్బంది సున్నం చెరువు బఫర్​ జోన్​లో నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. అయితే కూల్చివేతలను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ(MLA Arikepudi Gandhi) అడ్డుకున్నారు.

    MLA Arikepudi Gandhi | నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా తీరు

    హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. సున్నం చెరువు(Lime pond) వద్దకు చేరుకొని ఆయన కూల్చివేతలను అడ్డుకున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బఫర్​ జోన్​ హద్దులు నిర్ణయించకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్​రెడ్డి చెరువులు కబ్జాకు గురికాకుండా అభివృద్ధి చేయాలని హైడ్రాను ఏర్పాటు చేశారన్నారు. కానీ హైడ్రా అధికారులు(Hydra Officers) మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా తీరుతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. కాగా అరికెపూడి గాంధీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా బీఆర్​ఎస్​ నుంచి గెలుపొందారు. అనంతరం ఆయన కాంగ్రెస్​లో చేరారు.

    MLA Arikepudi Gandhi | ఉద్రిక్తతల నడుమ కూల్చివేతలు

    సున్నం చెరువులో హైడ్రా అధికారులు ఉద్రిక్తతల నడుమ కూల్చివేతలు కొనసాగించారు. ఎమ్మెల్యే అడ్డుకున్నా.. స్థానికులు జేసీబీలకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపినా కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. భారీ బందోబస్తు మధ్య అధికారులు చెరువు బఫర్​ జోన్​లోని నిర్మాణాలను కూల్చివేశారు.

    More like this

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...