115
అక్షరటుడే, ఆర్మూర్/బాల్కొండ: Panchayat Elections | పంచాయతీ పోరులో భాగంగా మూడో విడత పోలింగ్ (polling stations) ప్రశాంత వాతావరణంలో జరుగుతోంది. ఉదయం 11 గంటలకు 50శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే (cold weather) ఓటర్లు పోలింగ్ కేంద్రాలను తరలివస్తున్నారు. ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సందర్భంగా పలువురు ప్రముఖలు తమ ఓటు వేశారు.
Panchayat Elections | ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి..
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తన సొంత గ్రామమైన అంకాపూర్‌లో కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా తరలివచ్చి ఓటు వేశారు.
