అక్షర టుడే, నిజాంసాగర్: MLA Thota Lakshmi Kantharao | అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు (government schemes) అందేలా చూడాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. నిజాంసాగర్ మండలకేంద్రంలో (nizamsagar mandal center) నిర్వహించిన సమావేశంలో శనివారం మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు (indiramma houses) అందేలా చూడాలన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పని చేయాలన్నారు. కార్యక్రమంలో పిట్లం ఏఎంసీ ఛైర్మన్ మనోజ్ కుమార్, పార్టీ మండలాధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, నాయకులు ప్రజాపండరి, వెంకటరామిరెడ్డి, రాజారాం, కిష్టారెడ్డి, జగన్, తదితరులు పాల్గొన్నారు.
