అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jukkal MLA | జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmi Kantha Rao) మన్మథస్వామిని దర్శించుకున్నారు. జుక్కల్ నియోజకవర్గ పర్యటన అనంతరం ఆయన మంగళవారం కపిల్దార్కు బయలుదేరారు. అక్కడ భక్తులతో కలిసి మన్మథస్వామికి (Manmatha Swamy) పూజలు చేశారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Jukkal MLA | సోమాయప్పతో కలిసి పాదయాత్రలో..
ముందుగా భక్తులతో కలిసి కపిల్దార్కు పాదయాత్రగా వెళ్తున్న సద్గురు సోమాయప్పను ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మార్గమధ్యలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పాదయాత్రలో కొద్దిసేపు నడిచి.. ఆ తర్వాత కపిల్దార్కు వెళ్లారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులున్నారు.
