అక్షరటుడే, ఎల్లారెడ్డి: Panchayat Elections | జుక్కల్ (Jukkal) మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావును (Mla Laxmi Kantha Rao) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. గ్రామాల అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బిజ్జల్ వాడి గ్రామంలో గంగు బాయి, బంగారుపల్లి గ్రామంలో గాయబాయి మాణిక్ రావు, చిన్నగుల్ల గ్రామంలో జ్ఞానేశ్వర్, మథురి తండాకు అనిత మోహన్, దోస్త్ పల్లి గ్రామంలో మారుతిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే పిట్లం మండలం గౌరారం తండాలో నరేంద్ర సింగ్ ఏకగ్రీవం అయ్యారు.
గ్రామాలను అభివృద్ధి పథంవైపు నడిపించాలి..
ఏకగ్రీవమనేది గ్రామాల్లో ఐక్యతను ప్రతిబింబిస్తుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. అలాగే ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం తరపున ఎల్లప్పుడు మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.