అక్షర టుడే, ఎల్లారెడ్డి: Jukkal MLA | నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులు, సమస్యలు, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలపై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు (MLA Thota Lakshmi Kantarao) జిల్లా అధికారులతో చర్చించారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi), అన్ని శాఖల అధికారులతో సుధీర్ఘ చర్చల్లో గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించే దిశగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. అధికారులు అందరూ సహకరించి నిబద్ధతో పనిచేయాలని కోరారు. నియోజకవర్గంలో విద్య, వైద్య వ్యవస్థలను మెరుగు పర్చాలని, దానికనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడంలో రాజీ పడవద్దన్నారు.

