అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Mla Sudarshan Reddy | విజయవాడలోని కనక దుర్గమ్మ ఆలయాన్ని (kanakadurga Temple) మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈమేరకు గురువారం ఆయనతో పాటు జిల్లాకు చెందిన ముఖ్యనాయకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief mahesh) మేనల్లుడి వివాహ వేడుకలు విజయవాడలో జరగనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు అక్కడి కనకదుర్గ ఆలయాన్ని సందర్శించారు.
పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి(Manala Mohan reddy), నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా(NUDA) ఛైర్మన్ కేశ వేణు (Kesh Venu), వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్ (Gadudu Gangadhar), సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్ (narala ratnakar), ఆర్మూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పీపీసీ చీఫ్ మేనల్లుడి వివాహనికి హాజరైన ఎమ్మెల్యే మదన్మోహన్
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మేనల్లుడు పవన్ రాజ్–సాయి శృతి వివాహం విజయవాడలో జరిగింది. ఈ వేడుకలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మదన్ మోహన్ కూడా వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.