అక్షరటుడే, బోధన్: Mla Sudharshan reddy | మూడురోజులుగా వర్షాలు కురుస్తున్నందున మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని షర్బత్ కెనాల్(Sharbath Canal), సరస్వతినగర్ (Saraswati Nagar), హనుమాన్ టేక్డి (Hanuman Tekdi) తదితర ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. అనంతరం బోధన్ ఆస్పత్రిని (Bodhan Government Hospital) సందర్శించారు. వర్షం కారణంగా రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Mla Sudharshan reddy | మున్సిపల్ అధికారులతో సమీక్ష
ఆస్పత్రిని సందర్శించిన అనంతరం మున్సిపాలిటీలో అధికారులకు సమీక్ష నిర్వహించారు. వరుసగా వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశాలుంటాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉన్నవారికి ముందుజాగ్రత్తగా హెచ్చరికలు జారీచేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ యంత్రాంగం అలర్ట్గా ఉండాల్సిన సమయమని చెప్పారు.