అక్షరటుడే, బాన్సువాడ: Banswada | విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Mla Pocharma Srinivas Reddy) ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. నస్రుల్లాబాద్‌లో (Nasrullabad) మండలం దుర్కి (Durki) శివారులోని ఎస్‌ఆర్‌ఎన్‌కే (SRNK Degree college) ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గల వసతి గృహం నుంచి గురువారం ఉదయం విద్యార్థినులతో కలిసి ఆయన బస్సులో వెళ్లారు.
ఈనెల 14న బాన్సువాడ నుంచి తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తుండగా దుర్కిశివారులో ఉన్న ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రహదారిపై బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఆయన ఆగారు. గురుకుల వసతి గృహ విద్యార్థినుల బస్సు సమస్యను విని వెంటనే బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
విద్యార్థినుల సౌకర్యార్థం ఉదయం, సాయంత్రం ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గురువారం పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి బస్సు సర్వీసులను తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి బాన్సువాడ జూనియర్ కళాశాల వరకు ప్రయాణించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థినులు మాట్లాడుతూ.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలేజీకి వెళ్తున్నామని, మా సమస్యను గమనించి వెంటనే పరిష్కరించిన పోచారంనకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ డిపో అధికారులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

