అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh reddy | అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు గోస పడుతున్నా.. పట్టించుకోని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.
ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు. రైతు భరోసా (Raithu Bharosa), రుణమాఫీ, రైతు భరోసా సక్రమంగా అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందాల పోటీలపై (Beauty contest) ఉన్న శ్రద్ధ, రైతులపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా పని చేయడం లేదన్నారు. సీనియర్ మంత్రులు ఉన్నా.. పాలనచేత కావట్లేదన్నారు. ఇకనైనా ప్రభుత్వం మాటలు మాని చేతల్లో చూపించాలన్నారు. సమావేశంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పాలేపు రాజు, పట్టణ అధ్యక్షుడు బాలు, శ్రీనివాస్, అనిల్, రంగన్న, తదితరులు పాల్గొన్నారు.