అక్షరటుడే ఆర్మూర్ : MLA Rakesh Reddy | పంచాయతీ ఎన్నికల్లో భాగంగా (Panchayat Elections) పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఒంటి గంటకు పోలింగ్ పూర్తవ్వగా.. క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఓటువేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.
MLA Rakesh Reddy | పల్లెలను చూసి పట్టణ ప్రజలు బుద్ధితెచ్చుకోవాలి
ఈ సందర్భంగా ఉదయాన్నే సొంతగ్రామంలో ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు వేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్లెలను చూసి.. పట్టణవాసులు సిగ్గుపడాలని ఆయన పేర్కొన్నారు. పల్లెల్లో వృద్ధులు సైతం క్యూలైన్లలో నిలబడి ఓట్లేస్తుంటే.. పట్టణాల్లో మాత్రం పోలింగ్ రోజు హాలీడే దొరికిందని సంబరపడిపోయి ఫౌమ్హౌస్లలో సంబరాలు చేసుకుంటారని మండిపడ్డారు. ఓటు విలువ తెలిసిన వృద్ధులు సైతం క్యూలైన్లలో నిలబడ్డారన్నారు.
MLA Rakesh Reddy | మహాత్ముల త్యాగాలతో..
మహాత్ముల త్యాగాలతో వచ్చిన దేశ స్వతంత్రాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఓటు హక్కు వినియోగంతోనే సుపారిపాలన సాధ్యమన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో (Jubilee Hills by-Election) ఓ వర్గానికి చెందిన పోలింగ్ బూత్‌లలో 92 శాతం ఓటింగ్ నమోదైతే.. మరోవర్గం బూత్‌లలో 20శాతం కూడా ఓటింగ్ కాలేదన్నారు. ఓడిన నేతలు నిరాశ చెందవద్దని.. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్సార్, కేసీఆర్, ఇప్పటి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఒకప్పుడు ఓడి గెలిచినవారేనని వెల్లడించారు. ఓడి పోయామని ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.