అక్షరటుడే, బాన్సువాడ: Telangana Tirumala | బీర్కూర్ మండలం తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని (Tirumala Tirupati Devasthanam) ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బోధన్ మండలం (Bodhan Mandal) ఆచన్‌పల్లికి చెందిన కామేపల్లి ప్రశాంత్, ప్రవళిక దంపతులు ఆలయానికి రూ.1,11,111 విరాళాన్ని ఆలయ ధర్మకర్త పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి (Pocharam Bhaskar Reddy), శంభురెడ్డి, బీర్కూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీమతి దుర్గం శ్యామల, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.