అక్షరటుడే, బాన్సువాడ: MLA Pocharam Srinivas Reddy | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా చూడాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) సూచించారు. పట్టణంలో మండలాల ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు (Indiramma House Committee members), అధికారులతో కలిసి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు నిర్మించుకుంటున్న పేదవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. అలాగే ఇళ్ల నిర్మాణం సజావుగా సాగేలా పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా విచారణ చేపట్టి, నిజమైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ (Agro Industries Chairman Kasula Balaraj), సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi), మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, సురేష్, వినయ్ పాల్గొన్నారు.
