అక్షరటుడే, బాన్సువాడ: Sant Sevalal Maharaj | గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. గురువారం వర్ని మండలం అంతాపూర్ తండాలో నూతనంగా నిర్మించిన జగదంబా మాత (Jagadamba Matha), సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యారు. పౌరాదేవి పీఠాధిపతి సంత్ బాబుసింగ్ మహారాజ్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడు మార్గాన్ని వీడి ఆధ్యాత్మిక మార్గంలో పయనించేలా సేవాలాల్ మహారాజ్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్, పోచారం సురేందర్ రెడ్డి, తండా నాయక్ తదితరులు పాల్గొన్నారు.