అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. గురువారం బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రిని (Maternal and Child Hospital) సందర్శించారు. రోగులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Mla Pocharam | ప్రైవేట్ అంబులెన్స్‌ల ఆగడాలు పెరిగాయి..
అనంతరం మాతా శిశు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక నాయకులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ అందుబాటులో ఉండాలని, ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు ఎక్కువయ్యాయని అన్నారు. రక్త పరీక్షల కోసం జిల్లా కేంద్రానికి పంపించాల్సి వస్తుందని ఎమ్మెల్యేకు వివరించారు.
Mla Pocharam | భోజన ఏజెన్సీ నిర్వాహకుడిపై ఆగ్రహం..
రోగులకు భోజనం అందించే ఏజెన్సీ నిర్వాహకుడిపై పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. శానిటేషన్ నిర్వహణ సరిగా లేదని సూపర్వైజర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూపరిండెంట్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి(Sub-Collector Kiranmayi), ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్(Agro Industries Chairman Kasula Balaraj), మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, నాయకులు కృష్ణారెడ్డి, ఎజాజ్, శివ దయాల్ వర్మ తదితరులు పాల్గొన్నారు.