అక్షరటుడే, బాన్సువాడ : Banswada MLA | బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డులో ఉన్న ఎల్లయ్య చెరువును (Ellayya pond) ఆధునికీకరించనున్నట్లు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) తెలిపారు. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చెరువును తీర్చిదిద్దుతామన్నారు.
ఎల్లయ్య చెరువు పనులను రూ.3.14 కోట్ల వ్యయంతో ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజుతో (Kasula Balaraju) కలిసి ఆయన గురువారం ప్రారంభించారు. చెరువు జీవం కోల్పోయిన నేపథ్యంలో దాని అభివృద్ధి, ఆధునికీకరణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని చెప్పారు.
Banswada MLA | ట్యాంక్‌బండ్ తరహాలో..
పట్టణ ప్రజలకు విహార వేదికగా మారేలా ట్యాంక్‌బండ్ తరహాలో ఎల్లయ్య చెరువును అభివృద్ధి చేస్తున్నామని, కల్కి చెరువు మాదిరిగా సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పనుల ద్వారా పరిసర ప్రాంతాల అభివృద్ధితో పాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జంగం గంగాధర్, ఖాలేఖ్, మొహమ్మద్ గౌస్, కృష్ణారెడ్డి, ఎజాస్, నార్ల సురేష్, వెంకన్న గుప్తా, మోహన్ నాయక్, రాజేశ్వర్, ఎండీ దావూద్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.