అక్షరటుడే, బాన్సువాడ: MLA Pocharam | వర్షాల కారణంగా ధాన్య తడిసిపోతున్నందున కేంద్రాల్లో కొనుగోళ్ల వేగం పెంచాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండలం కిష్టాపూర్, చించోల్లి, బాన్సువాడ మండలం (Banswada mandal) కొల్లూరు గ్రామాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు.
MLA Pocharam | రెండురోజులుగా వానలు..
రెండు రోజులుగా కురిసిన వర్షాల ప్రభావంతో తడిసిన ధాన్యం కొనుగోలు వ్యవహారాన్ని వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా డీఎస్‌వోతో ఫోన్‌లో మాట్లాడి లారీల కోసం ఎదురుచూడకుండా తూకంవేసిన ధాన్యం బస్తాలను (paddy bags) వెంటనే రైస్‌మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైస్‌మిల్లర్లు కూడా ధాన్యం బస్తాలు మిల్లుకు చేరగానే తక్షణమే దింపుకొని రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, తూకం వేసిన బస్తాలు, ధాన్యం రాశులపై పాలిథీన్ కవర్లు కప్పి రక్షించుకోవాలని రైతులకు సూచించారు.
