అక్షరటుడే, బాన్సువాడ:MLA Pocharam | కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్(Shaadi Mubarak) చెక్కులను వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో 122 మంది లబ్ధిదారులకు రూ. 1.22 కోట్ల చెక్కులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీర్కూర్ ఏఎంసీ ఛైర్మన్ శ్యామల, మాజీ ఛైర్మన్ గంగాధర్, ఎజాజ్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింలు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.