అక్షరటుడే, ఆర్మూర్: MLA Paidi Rakesh Reddy | కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) అధికారులను ఆదేశించారు. మాక్లూర్(Makloor) మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (Paddy Center) మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ హమాలీల కొరతను వెంటనే తీర్చాలని.. ధాన్యాన్ని వెనువెంటనే తూకాలు వేసి రైస్ మిల్లులకు పంపాలని ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ కిరణ్(Additional Collector Kiran), బీజేపీ నాయకులు రైతులు ఉన్నారు.
MLA Paidi Rakesh Reddy | కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరించాలి
- Advertisement -
