అక్షరటుడే, భిక్కనూరు: Bhiknoor congress | సీఎం రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని భిక్కనూరు కాంగ్రెస్ (Bhiknoor congress) నాయకులు పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Huzurabad MLA Padi Kaushik Reddy) దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం వారు ర్యాలీగా వెళ్లి భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి (Bhiknoor police Station) ఎస్సైకి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి (PCC Secretary Indrakaran Reddy), గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నేతలు బల్యాల సుదర్శన్, నేతలు అంకంరాజు, నరేందర్‌రెడ్డి, నాగరాజు, శ్రీరాం, వెంకటేష్, మైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు