అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Padi Kaushik Reddy | హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (MLA Kaushik Reddy) అరెస్ట్ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది.
ఆయనకు మొదట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే చివరి నిమిషంలో హైకోర్టు న్యాయవాదులు (High Court Advocates) వచ్చి కౌశిక్‌రెడ్డి తరఫున వాదించారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని వారు పేర్కొన్నారు. రిమాండ్ సరికాదంటూ హైకోర్టు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సెక్షన్ 308(5) బెయిల్ ఎలిజిబులిటీ ఉందని అన్నారు. దీంతో కాజీపేట్‌లోని రైల్వే కోర్టు (Railway Court) మేజిస్ట్రేట్ కౌశిక్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిని బెదిరించిన కేసులో ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.