అక్షర టుడే, ఎల్లారెడ్డి: MLA Madanmohan Rao | సచివాలయంలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆధ్వర్యంలో మంగళవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madanmohan Rao) హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనుల పురోగతి, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పోచారం ప్రాజెక్ట్ (Pocharam project) బలోపేతం, సిల్ట్ తొలగింపు చర్యలు, ప్రాజెక్ట్ ప్రవాహం కింద చెట్ల తొలగింపు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యం కారణంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, వెంటనే మరమ్మతులు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించి, నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నీటి పారుదుల శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, ఈసీ, చీఫ్ ఇంజినీర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.