అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla madan Mohan Rao | గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు బుధవారం వాటిని పరిశీలించారు. ఆర్డీవో పార్థసింహారెడ్డి, ఇతర శాఖల అధికారులతో కలిసి నాగిరెడ్డి పేట్ (Nagireddy pet) మండలంలోని చిన్నూర్, బంజార తండా, వెంకంపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న పంటలు పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందవద్దని, పంట నష్ట పరిహారం అందేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రివర్గానికి అధికారికంగా నివేదించేందుకు ప్రత్యేక నివేదికను (representation) రూపొందిస్తామని ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేలా కృషిచేస్తామని చెప్పారు.
మంజీర నదిలో (Manjeera Rivar) వరద పెరుగుతుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్ట్ (Nizamsagar Project) నుంచి 1.5 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ ఇంజినీర్, కామారెడ్డి (kamareddy) జిల్లా సీఈ, నిజాంసాగర్ ప్రాజెక్ట్ డీఈఈతో మాట్లాడి పరిస్థితి వివరించారు. వారు స్పందించే విధంగా చర్యలు చేపడతామని హామీనిచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో, కాంగ్రెస్ మండలాధ్యక్షులు, సీనియర్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.