అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan | తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడిలోని సిద్దుల గుట్ట సిద్దేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం 34వ వార్షికోత్సవం, కార్తీకపౌర్ణమి సందర్భంగా ఆలయంలో జరిగే కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కార్తీక పౌర్ణమి (Karthika Pournami) శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యలు మాట్లాడుతూ..ఆలయంలో మూర్తిని దర్శించుకోవాలంటే సుమారు 350 మెట్లు ఎక్కి రావాల్సి వస్తోందని.. ఇది కష్టంగా ఉందని వారు పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయానికి సీసీ రోడ్డు వేయించేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు అన్నివిధాలా కృషి చేస్తానని హామీనిచ్చారు.
