అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan | దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘటన్ సద్భావన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగే సంఘటన్ కార్యక్రమానికి మాజీ కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్(Union Minister Salman Khurshid) హాజరయ్యేందుకు వచ్చారు.
ఆయనను ఎల్లారెడ్డి(Yellareddy) ఎమ్మెల్యే ఆదివారం సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ రావుతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ సీఎం రేవంత్‌రెడ్డి (cm revanth reddy), పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంఘటన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.