అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA | పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారి నిమజ్జనోత్సవ పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. కార్యకర్తలు, నాయకులు శోభాయాత్రను ఘనంగా నిర్వహించి ఎల్లారెడ్డి (Yellareddy) పెద్ద చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.