అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jukkal Mla | బిచ్కుంద మండల (Bichkunda mandal) కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmi Kanta Rao) శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో వేగం పుంజుకుందన్నారు.
Jukkal Mla | మిషన్ భగీరథ పైప్లైన్..
గ్రామీణ తాగు నీటి సరఫరా శాఖ (Water Supply Department) ఆధ్వర్యంలో రూ.26.84 లక్షలతో మిషన్ భగీరథ ట్యాంక్ (Mission Bhagiratha tank) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండలంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
