అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Distributes Shoes | జుక్కల్ మండలం (Jukkal Mandal) కౌలాస్ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు గురువారం షూస్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmi Kantha Rao) సతీమణి తోట అర్చన ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
MLA Distributes Shoes | పేద విద్యార్థులకు..
ఎమ్మెల్యే సతీమణి తోట అర్చన ఆధ్వర్యంలో హైస్కూల్లో విద్యార్థులకు బూట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తానే స్వయంగా విద్యార్థినికి షూ తొడిగించి లేస్ కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, చిన్నపిల్లల అవసరాలను గుర్తించి వారికి సాయం చేయడం ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
విద్యతో పాటు మౌలిక వసతులపై శ్రద్ధ..
ప్రభుత్వం విద్యతో పాటు పిల్లల మౌలిక అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తెలిపారు. పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చూసి స్థానికులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు కూడా కొనసాగిస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు (Congress Leaders), ఉపాధ్యాయులు పాల్గొన్నారు.