అక్షరటుడే, కామారెడ్డి: Mla KVR | కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను (Railway Minister Ashwini Vaishnav) కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (Mla venkata Ramana Reddy) బుధవారం కలిశారు. జిల్లా కేంద్రంలో మూడు ఆర్వోబీలు, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు.
Mla KVR | కామారెడ్డి జిల్లా కేంద్రంలో..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్టిలో పెట్టుకొని స్నేహపురి కాలనీ నుంచి కలెక్టర్ కార్యాలయం రోడ్ వరకు రైల్వేలైన్ మీదుగా ఒక ఆర్వోబీ అవసరం ఉందని విన్నవించారు. అలాగే వికాస్ నగర్ కాలనీ నుంచి ఇస్లాంపురా వరకు రైల్వేలైన్ (Railway line) మీదుగా ఒక ఆర్వోబీ, పాత రాజంపేట రైల్వేగేట్ వద్ద ఒక ఆర్వోబీ అవసరముందన్నారు.
Mla KVR | ప్రియాటాకీస్ రోడ్ నుంచి..
ప్రియాటాకీస్ రోడ్డు నుంచి ఇందిరా చౌక్ వరకు రైల్వేస్టేషన్ మీదుగా పాదచారులు నడుచుకుంటూ వెళ్లడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి కోరామన్నారు. కేంద్ర మంత్రి కూడా బ్రిడ్జిల నిర్మాణానికి నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలో రైల్వే అధికారులు స్థల పరిశీలన చేయాలని కేంద్ర మంత్రి ఆదేశించినట్లు తెలిపారు.