ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిShabbir Ali | అభివృద్ధిని ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు: షబ్బీర్​అలీ

    Shabbir Ali | అభివృద్ధిని ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు: షబ్బీర్​అలీ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | నియోజకవర్గ (Kamareddy Constituency) అభివృద్ధిని ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి (MLA Venkata Ramana Reddy) అడ్డుకుంటున్నాడని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) ఆరోపించారు. ఆయన పనులు చేయడం లేదని, చేసే వాళ్లను చేయనివ్వడం లేదని విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కింగ్ కన్వెన్షన్ హాల్​లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాట్లాడితే రేవంత్ రెడ్డి(Revanth Reddy), కేసీఆర్​(KCR)ను ఓడించానని చెప్పుకుంటున్నారని, అదే మాదిరిగా అభివృద్ధి చేసి చూపించాలన్నారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా కామారెడ్డికి రావాల్సిన వసతులు పక్కా నియోజకవర్గాలకు వెళ్తున్నాయన్నారు. 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేస్తుందని, ఎమ్మెల్యే వైఖరితో కామారెడ్డికి (kamareddy) రావాల్సిన పాఠశాలలు జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడకు వెళ్లాయని తెలిపారు. కేంద్రంలో ఉన్న మంత్రుల ద్వారానైన నిధులు మంజూరు చేయించాలని డిమాండ్​ చేశారు. బీబీపేట్​ మోడల్​ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడానికి వెళ్తానంటే.. షబ్బీర్​ అలీ వస్తాడో చూస్తానని వ్యాఖ్యానించడం ఆయనకే చెల్లిందన్నారు.

    Shabbir Ali | ప్రజల్లోకి వెళ్లకుంటే ఎలా..?

    ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుండగా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ఉపయోగం ఏమిటని కార్యకర్తలపై ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని కార్యకర్తలు యాక్టివ్​గా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు(DCC President Kailas Srinivas Rao), జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, భిక్కనూరు, కామారెడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మన్లు పాత రాజు, ధర్మగోని లక్ష్మీ, పట్టణ, రూరల్ అధ్యక్షులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...