అక్షరటుడే, ఆర్మూర్: School Games | నియోజకవర్గంలో నిర్వహించనున్న అంతర్‌పాఠశాలల టోర్నీ ప్రారంభోత్సవానికి రావాలని ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డిని (Mla Rakesh Reddy) టోర్నీ నిర్వాహకులు కోరారు. ఎమ్మెల్యేను ఆయన స్వగృహంలో శనివారం కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఈనెల 10వ తేదీ నుంచి 12 వరకు ఆర్మూర్ అర్బన్ టోర్నమెంట్ (Armoor Urban Tournament) జరుగనుందని వారు పేర్కొన్నారు. అలాగే 15 నుంచి 17 వరకు చేపూర్(Chepur) ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ రూరల్ మండల అంతర్ పాఠశాలల టోర్నీనిర్వహిస్తున్నట్లు వారు ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు.
ఎమ్మెల్యేను ఆహ్వానించిన వారిలో స్పోర్ట్స్ కన్వీనర్లు లక్ష్మీనర్సయ్య, చేతన కుమారి, ఎంఈఓ రాజగంగారాం ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శులు మల్లేశ్‌గౌడ్, మైలారం గంగాధర్, సంగెం అశోక్, సౌడ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.