Mla venkata ramana Reddy
Mla venkata ramana Reddy | డబుల్ బెడ్​రూం ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

అక్షరటుడే, కామారెడ్డి: Mla venkata ramana Reddy | పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో (Rajiv nagar) గల డబుల్ బెడ్ రూం ఇళ్లను (Double bedroom) ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipally Venkata Ramana Reddy) శనివారం సాయంత్రం పరిశీలించారు.

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డబుల్ బెడ్​రూం ఇళ్ల వద్ద నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రెయినేజీ, తాగునీరు, రోడ్డు, పారిశుధ్యం వంటి సమస్యలను కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత తొందరగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.