HomeతెలంగాణMLA Dhanpal | గణేష్ మండపాలకు ఎమ్మెల్యే ధన్​పాల్​ సహకారం..

MLA Dhanpal | గణేష్ మండపాలకు ఎమ్మెల్యే ధన్​పాల్​ సహకారం..

- Advertisement -

అక్షర టుడే, ఇందూరు : MLA Dhanpal | ధన్​పాల్​ లక్ష్మీబాయి, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ప్రతి ఏడాది గణేష్​ మండళ్లకు చందాలు (Ganesh Mandals Donations) అందజేస్తున్నారు.

MLA Dhanpal | హిందువుల ఐకమత్యం పెంపొందించేందుకే..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్​పాల్ ​(MLA Dhanpal) సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ..హిందుల్లో ఐకమత్యాన్ని పెంపొందించేందుకు గత పదేళ్లుగా గణేష్​ మండళ్లకు చందాలు అందజేస్తున్నానన్నారు. బాలగంగాధర్​ తిలక్​, ఛత్రపతి శివాజీ మహరాజ్​లను స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నానని స్పష్టం చేశారు.సెక్యులర్ ముసుగులో హిందువుల ఐక్యతను విడగొట్టే కుట్రలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే మార్వాడీ గో బ్యాక్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. ఇప్పటిదాకా 700 మండపాలకు సహకారం అందించడం జరిగిందన్నారు. గణపతి నవరాత్రులను యువత భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు బీజేపీ నాయకులు(BJP Leaders) పాల్గొన్నారు.