34
అక్షరటుడే, ఇందూరు: TPUS Nizamabad | జిల్లా కేంద్రంలో తపస్ ఆధ్వర్యంలో రూపొందించిన టేబుల్ క్యాలెండర్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో తపస్ భవనానికి స్థలం కోసం ఆయన హామీ ఇచ్చారు.
TPUS Nizamabad | ఘనంగా సన్మానం..
కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన తపస్ ఇందూరు జిల్లా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మధుసూదన చారిలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు రామకృష్ణ రెడ్డి, కీర్తి సుదర్శన్, మాజీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, జిల్లా బాధ్యులు సంజయ్ పాండే, శ్యాం ప్రసాద్, శ్రీకాంత్, రమణ, శివ ప్రసాద్, గోవర్ధన్ పాల్గొన్నారు.