అక్షరటుడే, ఇందూరు:Mla Dhanpal Suryanarayana Guptha | యువత అల్లూరిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బుధవారం నగరంలోని కోటగల్లిలో అల్లూరి సీతారామరాజు(Alluri Seetharama Raju) విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే(MLA Dhanpal Suryanarayana Guptha) మాట్లాడుతూ.. స్వతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు జరిపిన పోరాటం ప్రత్యేకమైందన్నారు. మన్యం ప్రజల ప్రాణరక్షణకు తెల్లదొరలను ఎదిరించి గిరిజన జాతిని ఏకం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. నేటి యువత అల్లూరిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే విధంగా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ మహోత్సవం(Amruth Mahotsavam)లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
