అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | నగరంలోని సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో నిలిచిన వంతెన నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కావడం సంతోషంగా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. వంతెన నిర్మాణ (bridge construction) పనులకు ఆదివారం భూమిపూజ చేశారు.
Mla Dhanpal | పదేళ్లుగా నిలిచిన నిర్మాణం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్లుగా నిలిచిపోయిన వంతెన నిర్మాణ పనులను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించానన్నారు. వంతెన నిర్మాణం పూర్తయితే అమ్మ వెంచర్ రింగురోడ్డు ప్రాంతాలకు రాకపోకలు సులభమవుతాయని అలాగే భవిష్యత్తులో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (underground drainage) అభివృద్ధికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పారు.
ప్రస్తుతం ప్రతి డివిజన్‌కు రూ.కోటి చొప్పున నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు కేవలం ఆరంభమేనని భవిష్యత్తులో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే మంజూరు చేసి పనులు నిరాటంకంగా సాగేలా సహకరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ న్యాలం రాజు, ఎల్లమ్మ గుట్ట మున్నూరు కాపు సంఘం కమిటీ సభ్యులు, అమ్మ వెంచర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.