Homeజిల్లాలునిజామాబాద్​MLA Dhanpal | శంభునిగుడిలో ఎమ్మెల్యే ధన్​పాల్​ పూజలు

MLA Dhanpal | శంభునిగుడిలో ఎమ్మెల్యే ధన్​పాల్​ పూజలు

కార్తీకమాసం సందర్భంగా శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా శంభునిగుడిలో సోమవారం ప్రత్యేకపూజలు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal | కార్తీకమాసాన్ని పురస్కరించుకుని నగరంలో శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు అధికసంఖ్యలో శివక్షేత్రాలను (Shiva temples) దర్శించుకుంటున్నారు. భక్తితో పూజలు చేస్తున్నారు.

ఈ మాసంలో శివుడిని భక్తులు విశేషంగా ఆరాధిస్తారు. సోమవారాల్లో అభిషేకాలు, రుద్రపూజలు, లక్ష బిల్వార్చనలు, కార్తీక దీపాలు వెలిగించడం చేస్తుంటారు. భక్తులు (Devotees) ఉదయాన్నే పవిత్ర స్నానాలు చేసి ఆలయాలకు వెళ్లి పూజల్లో పాల్గొంటారు.

MLA Dhanpal | శంభుని గుడిలో..

నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ (Urban MLA Dhanpal Suryanarayana) దంపతులు సోమవారం నగరంలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం శంభునిగుడిలో (Shambhunigudi) ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రతినిధులు ఎమ్మెల్యే దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు.