అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal in assembly | తెలంగాణ అమరవీరులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం మాట్లాడారు.
MLA Dhanpal in assembly | మేనిఫెస్టోలో అమలు చేయాలి..
తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ తన గలం, కలంతో ప్రజలను చైతన్య పరుస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రత్యేక కృషి చేశారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అందెశ్రీ మృతి చెందిన తర్వాత ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. 2001 నుంచి 2014 వరకు 1200 మంది అమరవీరులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేశారన్నారు. వారికి న్యాయం చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిందని.. అమరవీరుల కుటుంబాలకు ఇస్తామన్న 250 గజాల ఇంటి స్థలం ఇప్పటికి ఎంత మందికి ఇచ్చారో వివరణ ఇవ్వాలని కోరారు. అమరవీరులకు కుటుంబాలకు రూ.25 వేల పెన్షన్ ఇస్తామన్నారని.. ఎంత మందికి ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలన్నారు.
MLA Dhanpal in assembly | అర్బన్‌లో ఒక్కరికి కూడా డబుల్ ఇళ్లు ఇవ్వలేదు..
గత ప్రభుత్వ హయాంలో పదేళ్ల కాలంలో అర్బన్ నియోజకవర్గ పరిధిలో అర్హులైన ఒక్క లబ్ధిదారుడికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. పేరుకు మాత్రమే నగర శివారులో డబుల్ బెడ్ రూంలు నిర్మించారని.. లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క నిరుపేదకు కూడా ఇళ్ల స్థలం అందివ్వలేదని, వెంటనే అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ధన్పాల్ డిమాండ్ చేశారు.