అక్షరటుడే, ఇందూరు : MLA Dhanpal | గ్రూప్–1లో 386 ర్యాంకు సాధించి, ఉద్యోగానికి ఎంపికైన నిజామాబాద్‌కు చెందిన నిఖిత రెడ్డి (Nikitha Reddy) ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాను (MLA Dhanpal Suryanarayana Gupta) మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కలవగా.. నిఖిత రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నిఖిత ఇరిగేషన్ శాఖలో (Irrigation Department) ఏఈగా ఉద్యోగం సాధించిందన్నారు. అంతటితో ఆగకుండా గ్రూప్ వన్‌లో డీఎస్పీగా ఎంపిక కావడం సంతోషకరమన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. అనంతరం ఆమెను సన్మానించారు.