అక్షరటుడే, కామారెడ్డి: MLA Challenge Issue | ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Kamareddy Government Degree College) ఆస్తుల విషయంలో (College Asset Dispute) నెలకొన్న వివాదం చర్చకు దారి తీసింది. శనివారం ఉదయం 10 గంటలకు సరస్వతి శిశుమందిర్ పాఠశాల వద్దకు ఆధారాలతో రావాలని ఎమ్మెల్యే కేవీఆర్ (Mla KVR) కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు.
MLA Challenge Issue | సై అన్న కాంగ్రెస్ నాయకులు..
తాను ఆధారాలతో స్వయంగా వస్తున్నానని.. వివరాలతో కాంగ్రెస్ నాయకులు సైతం రావాలని ఎమ్మెల్యే కేవీఆర్ శుక్రవారం సవాల్ (Political Challenge) విసిరారు. దీంతో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్ స్పందించారు. తాము సవాల్‌ను స్వీకరించామని.. ఎమ్మెల్యే ఆధారాలతో తప్పనిసరిగా రావాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు, కళాశాల పరిరక్షణ కమిటీ కూడా కచ్చితంగా రావాలని కోరారు. ఆధారాలతో సహా నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.