అక్షరటుడే, ఇందల్వాయి: Rural MLA Bhupathi Reddy | ఎవరెస్ట్ (Everest) అధిరోహించిన పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ (Malavat Purna) తండ్రి దేవదాస్ నాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి శనివారం సిరికొండ మండలంలోని పాకాల గ్రామానికి వెళ్లి పూర్ణ కుటుంబాన్ని పరామర్శించారు.
దేవదాస్ నాయక్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే, పూర్ణతో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. పూర్ణ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న, భాస్కర్ రెడ్డి, ఉమ్మాజీ నరేష్, మండల అధ్యక్షుడు బాకారం రవి, శివాజీ నాయక్, ప్రవీణ్, దేగాం సాయిలు, మహేందర్, బాకారం సంతోష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
