అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: Mla Bhupathi Reddy | ఎమ్మెల్యే భూపతిరెడ్డి శుక్రవారం పలు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ధర్మారంలోని బృందావన్ గార్డెన్లో డాక్టర్ రాజేంద్రప్రసాద్ మేనకోడలి వివాహం జరగగా.. రూరల్ ఎమ్మెల్యే హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే న్యాల్కల్లో కాంగ్రెస్ నాయకుడు పిప్పర శ్రీనివాస్ కూతురి వివాహనికి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉమ్మాజీ నరేష్, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, వాసు బాబు, అగ్గు భోజన్న, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.