అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Free Laptops | తమిళనాడు ప్రభుత్వం (Tamilnadu Government) విద్యార్థుల భవిష్యత్తును డిజిటల్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు వేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీ పథకం సోమవారం నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది.
‘ఉలగం ఉన్ కైగలిల్’ (ప్రపంచం మీ చేతుల్లో) అనే నినాదంతో అమలులోకి తీసుకొస్తున్న ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (CM M.K. Stalin) ప్రారంభించనున్నారు. చెన్నై ట్రేడ్ సెంటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) కూడా పాల్గొననున్నారు.
Free Laptops | రెండు దశల్లో 20 లక్షల ల్యాప్‌టాప్‌లు
విద్యార్థులను ఆధునిక సాంకేతికతతో అనుసంధానించి, వారిని గ్లోబల్ పోటీలకు సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. మొత్తం 20 లక్షల ల్యాప్‌టాప్‌లను రెండు దశల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 10 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఇంజనీరింగ్, మెడికల్, లా, అగ్రికల్చర్ కళాశాలలు, అలాగే పాలిటెక్నిక్, ఐటీఐ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఉన్నత విద్యలో చదువుతున్న పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
ప్రభుత్వం పంపిణీ చేసే ల్యాప్‌టాప్‌లు డెల్, ఏసర్, హెచ్‌పీ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లకు చెందినవి. ఇవి ఇంటెల్ i3 ప్రాసెసర్, 8 GB ర్యామ్, 256 GB ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ ఆఫీస్ 365 వంటి ఆధునిక సాఫ్ట్‌వేర్ ఫీచర్లతో అందుబాటులో ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్‌లు విద్యార్థుల అకడమిక్ అవసరాలతో పాటు కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), డేటా అనలిటిక్స్, వెబ్ డిజైనింగ్ (Web Designing) వంటి ఆధునిక నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఉపయోగపడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పటికే తమిళ పుదల్వన్, ఇన్నోవేటివ్ ఉమెన్, ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్ వంటి పథకాలను అమలు చేస్తూ విద్యలో సమాన అవకాశాలు కల్పిస్తోంది. తాజాగా ల్యాప్‌టాప్‌ల పంపిణీ ద్వారా గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించి, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది.