Homeజిల్లాలుకామారెడ్డిMission Bhagiratha leakage | మిషన్​ భగీరథ నీళ్లు.. రోడ్డు పాలు..

Mission Bhagiratha leakage | మిషన్​ భగీరథ నీళ్లు.. రోడ్డు పాలు..

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Mission Bhagiratha leakage | ఓ వైపు మండే ఎండలతో తాగునీటి కోసం తండావాసులు అవస్థలు పడుతుంటే.. మరోవైపు పైప్​లైన్ల లీకేజీ(Pipelines Leakage)ల కారణంగా మిషన్​ భగీరథ నీళ్లు(Mission Bhagiratha water) వృథా అవుతున్నాయి. మండలంలోని మంగ్లూర్​ శివారులోని ఆయిల్​ మిల్​ సమీపంలో మిషన్​ భగీరథ ప్రధాన పైప్​లైన్​ లీకేజీ అవుతోంది. లీకేజీ అయిన నీళ్లు చెరువును తలపిస్తోన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి లీకేజీకి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.