అక్షరటుడే, వెబ్‌డెస్క్: Director Sukumar | మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాత(Opal suchata) పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. 108 దేశాల బ్యూటీలను వెనక్కి నెట్టి ప్రపంచ సుందరి కిరీటాన్నిసొంతం చేసుకున్న ఈ థాయ్ భామ ఇప్పుడు బిజీబిజీగా మారింది. ఈ ముద్దుగుమ్మకి మన సినిమాలపై అలానే మన స్టార్స్‌పై కాస్త అవగాహన ఉంది.
Director Sukumar | బాలీవుడ్ చిత్రాలు చూశా
ఇటీవల ఇంటర్వ్యూలో నాకు బాలీవుడ్ నటి అలియాభట్(Bollywood actress Alia Bhatt) తెలుసు. నా జర్నీలో ఎంతో మంది సుందరీమణులు నాలో స్ఫూర్తి నింపారు’’ అని అన్నారు. నాకు ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) అంటే కూడా ఎంతో ఇష్టం. ఆమె నుంచి స్ఫూర్తి పొందాను. వీలునప్పుడు సినిమాలు చూస్తుంటా. బాలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాలు ఇప్పటికే చూశాను. అలియాభట్ Alia Bhatt నటించిన ‘గంగూబాయి కాతియావాడి’ నాకెంతో నచ్చింది. ప్రేక్షకులను ఆలోచింప చేేస చిత్రమది. ‘బాహుబలి’ సినిమా గురించి విన్నాను. కానీ, ఆ సినిమా ఇంకా చూడలేదు. మిస్ వరల్డ్ పోటీ(Miss World competition)ల్లో భాగంగా కొన్నిరోజుల క్రితం మేమంతా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శించాం. పోటీలు పూర్తయిన తర్వాత తప్పకుండా ఆ సినిమా చూడాలని నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా. మళ్లీ నేను ఇక్కడికి వచ్చే నాటికి తప్పకుండా ఆ సినిమాపై రివ్యూ ఇస్తా’’ అని చెప్పుకొచ్చింది ఓపల్ సుచాత. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ రాజ్‌భవన్(Telangana Raj Bhavan)లో సోమవారం ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ 2025 విజేత సుచాతతో పాటు ఐదు ఖండాలకు చెందిన విజేతలు పాల్గొన్నారు. వీరికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) తేనేటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Director Sukumar | ఓపల్‌తో సరదాగా..
గవర్నర్ తేనేటి విందు కార్యక్రమానికి సుకుమార్‌తో Sukumar పాటు ఆయన భార్య తబిత కూడా ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది. అయితే తేనీటి విందుకి హాజరైన ఓపల్ సుచాతతో సుకుమార్ పలు విషయాలపై చర్చ సాగించినట్టు తెలుస్తోంది. పుష్ప ప్రస్తావన కూడా వచ్చిందని టాక్ నడుస్తోంది. సుకుమార్ త్వరలో రామ్ చరణ్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఆ సినిమాలో ఓపల్(opal)కి ఏదైనా ఛాన్స్ ఇస్తాడా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.