అక్షరటుడే, వెబ్‌డెస్క్: Miss World : మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయా దేశాల 22 మంది సుందరీమణులు నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ కు చేరుకున్నారు. ఇక్కడి బుద్ధవనంలో పర్యటించారు. గిరిజన, జానపద నృత్య కళాకారులు వారికి ఘనస్వాగతం పలికారు.
ఇక్కడి పరిసరాలను చూసి సుందరీమణులు సంతోషం వ్యక్తం చేశారు. బౌద్ధ థీమ్‌పార్క్‌లోని బుద్ధ విగ్రహాల ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అంతకుముందు తెలంగాణ పర్యాటక సంస్థ విజయ్ విహార్(Telangana Tourism Organization Vijay Vihar)లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం సుందరీమణులంతా ఫొటోషూట్‌లో సందడి చేశారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా వీరు బుద్ధవనం పర్యటనకు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
బుద్ధవనానికి వచ్చిన వారిలో ఇండియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సింగపూర్, కంబోడియా, మయన్మార్, నేపాల్, వియత్నాం, జపాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, లెబనాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేసియా, మంగోలియా, తుర్కియే, చైనా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, ఆర్మేనియా దేశాల సుందరీమణులు ఉన్నారు.