అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Miss World final | తెలంగాణ(Telangana)లో కొన్ని రోజులుగా ఘనంగా సాగుతున్న మిస్ వరల్డ్ పోటీలు (Miss World competitions) నేటితో ముగియనున్నాయి.
హైదరాబాద్ (Hyderabad)లోని హైటెక్స్‌లో మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు శనివారం సాయంత్రం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ప్రారంభ వేడుకల్లో భాగంగా బాలీవుడ్ తారల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రపంచ సుందరీ కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు 108 దేశాల అందాలభామలు పోటీపడుతున్నారు. పలు రకాల వడపోతల అనంతరం నలుగురిని ఎంపిక చేస్తారు. ఈ నలుగురికి ఒక ప్రశ్న వేసి సమాధానం ఆధారంగా ప్రపంచ సుందరిని ప్రకటిస్తారు.