ePaper
More
    HomeతెలంగాణMiss World Competitions | మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలకు ఏకంగా 3500 మంది అతిథులా..వేదిక...

    Miss World Competitions | మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలకు ఏకంగా 3500 మంది అతిథులా..వేదిక ఎక్క‌డంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Miss World Competitions | మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. హైదరాబాద్ Hyderabad వేదిక‌గా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఈ 72వ మిస్ వరల్డ్ ఫైనల్స్ మే 31న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌(Hitex Exhibition Center)లో జరగనున్నాయి. శనివారం సాయంత్రం 5:30 గంటలకు రెడ్ కార్పెట్ ఈవెంట్‌తో ఈ ఫైనల్స్ ప్రారంభం కానుండ‌గా రాత్రి 9.30కి ముగుస్తాయి. .ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్న 40 మంది అందాల భామలు, ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు.

    Miss World Competitions | అత్యంత వైభ‌వంగా..

    ఇప్పటి వరకు జరిగిన స్పెషల్ ఛాలెంజ్‌ల ద్వారా 14 మంది పోటీదారులు క్వార్టర్స్‌కి నేరుగా ఎంపికయ్యారు.వీరిలో స్పోర్ట్స్ ఛాలెంజ్‌ నుంచి ఒకరు,టాలెంట్ ఛాలెంజ్‌లో ఒకరు,హెడ్ టు హెడ్ రౌండ్‌లో నలుగురు,టాప్ మోడల్ విభాగంలో నలుగురు,బ్యూటీ విత్ ఏ పర్పస్ విభాగం నుంచి మరో నలుగురు విజేతలుగా నిలిచారు.మిగిలిన 26 మంది ఎంపిక ప్రక్రియ వివిధ ఖండాల ప్రాతినిధ్యం మేరకు జరగనుంది. అమెరికా-కరేబియన్, ఆఫ్రికా Africa , యూరప్, ఆసియా-ఓషియానా ఖండాలకు చెందిన పోటీదారులను న్యాయనిర్ణేతలు ఎంపిక చేయనున్నారు. మే 31న జరిగే తుది పోటీల్లో టాప్ మోడల్ ఛాలెంజ్, స్పోర్ట్స్ ఛాలెంజ్, టాలెంట్ ఛాలెంజ్, బ్యూటీ విత్ ఎ పర్సన్ ఇలా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో 14 మంది క్వార్టర్ ఫైనల్స్ కి చేరారు.

    ఈ కార్యక్రమం సోనీ టీవీ 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందువల్ల.. ఇది తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెడుతోంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి revanth reddy, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు సహా 3,500 మంది ప్రేక్షకులు ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యం, ఆధునికతను ప్రదర్శించే ఈ కార్యక్రమం, రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా నిలపాలనే లక్ష్యంతో జరుగుతోంది. కాగా, గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ జరగగా.. ఇందులో 116 దేశాల నుంచి అందాల సుందరాంగులు పాల్గొన్నారు.

    Latest articles

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ...

    More like this