అక్షరటుడే, వెబ్డెస్క్ : Miss World | మిస్ వరల్డ్ 2025 పోటీలు ఎట్టకేలకు ముగిసాయి. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా (Hyderabad Hitex venue) జరిగిన ఈ అందాల పోటీల ఫైనల్స్ ఈవెంట్ కు అతిరథ మహారధులు తరలివచ్చారు. రాజకీయ, సినీ ప్రముఖులు (Political and film celebrities) ఈవెంట్ లో తళుక్కుమన్నారు. మిస్ వరల్డ్ టైటిల్ కోసం ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడగా, థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాత (opal suchata) కిరీటాన్ని అందుకున్నారు. ఈ భామకి 8 కోట్ల 50 లక్షల రూపాయల ప్రైజ్‌మనీ దక్కింది. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్‌లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మిస్ ఇండియా నందిని గుప్తా (Miss India Nandini gupta) టాప్-8లో కూడా స్థానం దక్కించుకోలేకపోయారు. కాగా.. మిస్ వరల్డ్ ఫైనల్స్ ఈవెంట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి దంపతులు (CM Revanth Reddy and Chiranjeevi couple) హాజరయ్యారు.
Miss World | అతి పెద్ద సవాల్..
ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలకు జడ్జీలుగా జూలియా మోర్లీ, సోనూ సూద్ (Sonu Sood), రానా దగ్గుబాటి (Rana Daggubati), మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ (Mahesh Babu wife Namrata Shirodkar), జయేశ్ రంజన్, మానుషి చిల్లర్, సుధారెడ్డి ఉన్నారు. సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో ముద్దుగుమ్మలు పాల్గొని తమ ప్రతిభను చాటడంతో పాటు తెలంగాణలో (Telangana) పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా (Telangana Zaroor Ana worldwide) నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. అయితే ఇప్పుడు అందరూ ఓపల్ సుచాత గురించి ఆరాలు తీస్తున్నారు. సెప్టెంబర్ 20, 2003లో జన్మించిన ఈ భామ థాయిలాండ్ లోని ఫుకెట్ నగరానికి చెందిన అమ్మాయి. థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ (Miss World) గెలిచిన తొలి మహిళగా ఓపల్ సుచాత చరిత్ర సృష్టించింది. ఆమె తల్లిదండ్రులు థానెట్ డోంకామ్నెర్డ్, సుపాత్ర చువాంగ్స్రీ. ఆమె కుటుంబం ఫుకెట్ నగరంలో వ్యాపారంలో రాణిస్తున్నారు.
ఆమె విద్యాభ్యాసం మొత్తం థాయిలాండ్(Thailand) లోనే సాగింది. ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన సుచాత 16 ఏళ్ల వయస్సులో జీవితంలో అతిపెద్ద సవాల్ ఎదుర్కొంది.. సుచాత బ్రెస్ట్ క్యాన్సర్ కు గురయ్యారు. తనకు క్యాన్సర్ ఉందని తెలుసుకున్న క్షణం భరించలేని ఒత్తిడికి, భయానికి గురైనట్లు సుచాత పేర్కొంది. మొత్తం కోల్పోయా అనే ఫీలింగ్ కలిగింది. నాకు సోకిన బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer) అంత అపాయకరమైనది కాదు. అయినప్పటికీ ఆ వయసులో నాకు కలిగిన ఆందోళన అంతా ఇంతా కాదు. బ్రెస్ట్ క్యాన్సర్ ను ఎదుర్కొనడానికి ఆ సమయంలో నాకు అన్ని వనరులు ఉన్నాయి. కానీ ఎలాంటి సదుపాయాలు లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ తో ఒంటరిగా పోరాటం చేస్తున్న మహిళల పరిస్థితి ఏంటి అని ఆలోచించా. అలాంటి మహిళల కోసమే ‘ఓపల్ ఫర్ హర్’ అనే ఉద్యమాన్ని ప్రారంభించాను. ఓపల్ ఫర్ హర్ సంస్థ ద్వారా చాలా మంది మహిళలకు ఉచిత స్క్రీనింగ్ అవకాశం కల్పించినట్లు ఆమె తెలిపారు. ఆమె చేస్తున్న ఈ అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. సుచాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆదర్శమని అంటున్నారు.